ఎదుగుదల

ఎదుగుదల అంటే ఇదేనేమో. నా గతంలో వాళ్లకి నేనెవరో తెలియదు. వాళ్లకి తెలిసున్న మనిషి మొత్తానికి వేరే. రూపమే మారింది అనుకుంటే అది సీతాకోకచిలుక అవ్వడు కదా? లోపల జరిగే మధనం ఎవరికి కనిపిస్తుంది? కొంత మంది ఐతే, నాకు వాళ్లు కావాలీ అని చాలా ప్రయత్నం చేశాను. పరిచయం మళ్లీ చేసుకుంటే ఈ నేను వేరు అని గుర్తించి, మరో స్నేహానికి నాంది చెప్తారు అనుకున్నా. నాతో మాటలే లేవు. అడిగితే, అలా ఏమీ లేదు అంటారు. ఇదివరకు ఎందుకు దూరంగా ఉంచుతున్నారు అని అడిగేదాన్ని. ఇప్పుడు, బాధ వున్నా అడగను. వాళ్లు కాదనుకున్నది ఆ పాత నన్ను. ఎంత పాత అంటే, నేనుకూడా గుర్తుపట్టలేనంత. ఇప్పుడున్న ఈ నేనుకి అవకాశమే ఇవ్వలేదు. అదింక వాళ్ల ఇష్టం. వద్దనుకుంటే వెంటపడలేనుగా. ఎప్పటికైనా కలుస్తామో లేదో. వెతుక్కుంటూ వస్తారని ఒకే చోట ఉండిపోలేను. ఎదురుచూపు కూడా అక్కడే ఉండి చేయాలా ఏంటి?

ఎదుగుదల అంటే ఇదేనేమో.







2024 లో2023 లో2022 లో2021 లో